GDWL: పండుగ సంతోషం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అనారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు.