KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దాతలు వెండి ఆభరణాలను సమర్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో దర్శనం ఇచ్చే ఉత్సవ మూర్తులకు కోరెం నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు 35 రకాల వెండి వస్తువులు (7.64 కిలోలు) అందజేశారు. వాటి విలువ సుమారు రూ. 21 లక్షలు ఉన్నట్లు అర్చకుడు శేషం రామాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.