SRCL: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో హిందూ సమ్మేళన సన్నక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడిగా సామ లచ్చి రెడ్డిని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 12న హన్మాజీపేటలో హిందూ సమ్మేళనం స్వామీజీలతో నిర్వహించడం జరుగుతుందని చుట్టుపక్క హిందూ బంధువులు హాజరు కాగలరని కోరారు.