MDCL: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 2,834 మంది సిబ్బందిని నియమించినట్లు జిల్లా DEO విజయ కుమారి తెలిపారు. అదనంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూ, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.