SRPT: జిల్లాలోని ముస్లిం సోదరులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని భక్తి, నియమ నిష్ఠలతో పాటిస్తూ ఉపవాస దీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని, ఈ మాసం మానవత్వం, సహనం, దానధర్మాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు చేకూరుతాయని అన్నారు.