HYD గచ్చిబౌలి స్టేడియంలో రేపు అనిరుధ్ ‘XV’ లైవ్ కన్సర్ట్ జరగనుంది. సా.4:30 గంటలకు గేట్లు తెరుస్తారు, 6:00 గంటలకు షో ప్రారంభం. రద్దీ దృష్ట్యా నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. టికెట్ రకాన్ని బట్టి బోల్డర్ హిల్స్, సంధ్యా కన్వెన్షన్, స్టేడియం వద్ద ప్రత్యేక పార్కింగ్ కేటాయించారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా క్యాబ్‌లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని కోరారు.