ప్రకాశం: మార్కాపురం మండలం ఇడుపూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద సంకుల మల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై వేమన మృతదేహాన్ని పరిశీలించారు. తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.