AP: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నుండి హైదరాబాద్, తిరుపతి నగరాలకు నేరుగా రైళ్లు నడపనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై సర్వే జరుగుతోందని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. గతంలోని లోపాలను సరిదిద్ది రైల్వే రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.