TG: ఒకే వాహనదారుడికి ఉన్న రెండో వాహనానికి విధిస్తున్న ట్యాక్స్ ఇకపై ఉండదు. సెకండ్ వెహికిల్స్‌కు వర్తించే అదనపు 2% లైఫ్ ట్యాక్సును ప్రభుత్వం రద్దుచేసింది. ఈ విధానం ఈనెల 23 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఈనెల 23న వాహన్ పోర్టల్‌ను ప్రవేశపెడుతున్నందున అదేరోజు నుంచి ఈ ట్యాక్స్ రద్దవుతుంది. జాతీయ పోర్టల్ వాహన్ అనుసంధానంతోనే వాహనదారులకు ఈ ప్రయోజనం కలుగుతుంది.