NDL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న ప్యాపిలి మండలం సిద్ధినగట్టు గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. విజేతలైన ఎద్దుల యజమానులకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ రూ.20,000, తృతీయ రూ.12,500, నాలుగో బహుమతి రూ.10,000గా నిర్ణయించారు.