HYD: నగరంలోని తిరుమలగిరి, లాల్‌బజార్, బొల్లారం, హకీంపేట్, షామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం చిరుజల్లులు కురిశాయి. నగరం అంతటా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లు తడవడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.