TG: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ఈ పండుగ.. సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, లౌకికవాదానికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.