ATP: మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులు మోసపోయారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో పాటు గ్రూప్-1, 2, పోలీస్ పోస్టులను పారదర్శకతతో భర్తీ చేస్తున్నట్లు వివరించారు.