HYD: రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉన్నత చదువుల ద్వారానే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలకు చేరుతాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్నతికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.