KMM: జిల్లా కేంద్రంలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్క రెనాల్ట్ కంపెనీలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్లో ఉత్తీర్ణత ఉన్న వారు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు వినియోగించుకోవాలన్నారు.