RR: ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటయ్యతో పాటు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.