SRCL: విద్యా విధానాల అధ్యయనం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన రామగిరి స్వరాజ్య లక్ష్మి అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎంపికయ్యారు. ఫిన్లాండ్లో అనుసరిస్తున్న విద్యా విధానం అవగాహన కోసం వెళ్లనున్నారు.