WGL: గోవా రాష్ట్రంలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ ఆర్గనైజ్ చేసిన సెమినార్లో శనివారం వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పాల్గన్నారు. ఈ సందర్భంగా మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల శక్తివృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళల పురాతన శక్తి ప్రతీకగా వరంగల్ ప్రాంతంలోని చారిత్రక ఘటనలను వివరించారు.