NRPT: ఉట్కూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరిని శుక్రవారం కలిశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.