RR: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జీవన ఎరువుల ప్రాముఖ్యత, రైతులకు కలిగే లాభాలు, జీవన ఎరువుల తయారీ మరియు జీవన ఎరువుల వ్యాపారం నైపుణ్యం, వ్యాపార ప్రారంభం తదితర అంశాలపై సూచనలు ఇస్తూ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. అసోసియేట్ డీన్ డాక్టర్ గోవర్ధన్ విద్యార్థులు స్వయం ఉపాధి అవకాశాలపై పలు సూచనలు చేశారు.