SRCL: బోయిన్పల్లి మండలం స్తంభంపల్లిలో ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పై రమాకాంత్ తెలిపారు. మంగళవారం చంద్రగిరి భరత్ అనే వ్యక్తి తన ట్రాక్టర్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేయడంతో, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు.