BHNG: బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, ఇళ్లు కోల్పోతున్న ప్రజలకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి భువనగిరి మండలం బస్వాపురంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ హాజరై మాట్లాడారు.