HYD: అంబర్‌పేట డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం డివిజన్ పరిధిలోని బాపూనగర్‌లో రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.