GDL: ప్రజల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకొని అక్రమ లేఔట్లను 25 శాతం రాయితీతో క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 31 వరకు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ సంతోశ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఎల్ఆర్ఎస్ చెల్లించని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.