MHBD: మరిపెడ మండలంలోని గిరిపురం బీసీ అంగన్వాడీ సెంటర్లో బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు ఉడకని కోడిగుడ్లు పంపిణీ చేశారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గిరిపురం గ్రామ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అదే నిర్లక్ష్యం కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.