NGKL: అచ్చంపేట పట్టణంలోని 20వ వార్డులో శుక్రవారం నూతన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమిపూజ చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రజలు దిగులు చందవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు, కౌన్సిలర్ రమేశ్ రావు తదితరులు పాల్గొన్నారు.