JGL: యాసంగి 2025-26 వరి ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో మంగళవారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, దిగుమతుల్లో ఎటువంటి జాప్యం జరుగకుండా చూడాలని, లారీల అన్ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు.