NZB: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నవీపేటలోని బాసర ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జాబ్ క్యాలెండర్, పెన్షన్ల పెంపు వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.