BHPL: రబీ 2025–26 వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలతో సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ చాంబర్లో వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సమయానుకూలంగా ప్రారంభించాలన్నారు.