NZB: NZB నగరంలోని పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి నిర్వహించింది. శుక్రవారం 6వ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ మిషన్ భగీరథ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని CCS ACP మస్తాన్ వలీ చెప్పారు. 4 సెల్ ఫోన్లు, 4 బైక్లు, ఒక ఆటో, రూ.11,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.