NZB: జిల్లాలో వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, MLAలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా పత్రాలను అందజేశారు.