WNP: కొత్తకోట మండలంలోని మీరాసిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సర్పంచ్ వైదేహితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు.