NRML: కుంటాల ఆదర్శ పాఠశాలలో 2026 -27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశం కోసం ఈనెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.