NRML: నిర్మల్ జిల్లా నుండి పలువురు బాక్సర్లు మే 24- 26 తేదీలలో మంచిర్యాలలో జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్- జూనియర్, బాల, బాలికల బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా బాక్సింగ్ సెక్రటరీ, కోచ్ స్వామి శుక్రవారం ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా అధికారులు, బాక్సింగ్ సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.