MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మహిళా వారోత్సవాల సందర్భంగా మేడ్చల్-మల్కాజ్గిరి ఫిషరీస్ ఛైర్మన్ మన్నే రాజు ఆధ్వర్యంలో 292 సాయిబాబా నగర్ డివిజన్లోని విజయలక్ష్మీ ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి హాజరయ్యారు.