RR: షాబాద్ చౌరస్తాలో డివైడర్ మధ్య ఉన్న నిరుపయోగమైన బాక్స్ ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బాక్స్ వల్ల HYD నుంచి వచ్చే వాహనాలు కనిపించక యూ-టర్న్ తీసుకునేవారు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి బాక్స్‌ను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరారు.