SRPT: తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో భారతరత్న, దేశ మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలను బీజేపీ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గడ్డం ఉప్పలయ్య మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం, దేశ సుస్థిరత కోసం వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.