VKB: వికారాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్నాయి. ధరూర్, బషీరాబాద్‌లో 42.3°C, తాండూరులో 42.1°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోటేపల్లి, యాలాల్, వికారాబాద్, దౌల్తాబాద్ ప్రాంతాల్లో 41°C పైగా నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు.