SRCL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పోలీసులు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు.