జనగాం: దేవరుప్పుల మండలంలోని మాధపురం, కడవెండి గ్రామాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.