MBNR: పెద్దకొత్తపల్లి మండలంలోని ఆదిరాల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.