JGL: జగిత్యాల మండలం ధరూర్‌లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని శివాని రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ జ్యోతిస్ మరియా తెలిపారు. ఈనెల 20 నుంచి 22 వరకు వాక్సిన్ యూనివర్సిటీలో జరిగే ఈ పోటీల్లో విద్యార్థిని పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపల్‌తో పాటు, ఉపాధ్యాయులు రెజీనా, లిల్లీ, రాణి, తదితరులు అభినందించారు.