BHNG: బండకొత్తపల్లి నుంచి దేవరుప్పల వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్, పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రోడ్లు సరిగా లేక గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వివరించి రహదారిని నిర్మించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.