KMR: జిల్లాలో ఇవాళ సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పాత రాజంపేటలో 21.8 మి.మీ ల మోస్తారు వర్షపాతం నమోదు కాగా సదాశివనగర్, దోమకొండ, పల్వంచ, రామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్ మండలాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు.