GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న యజమాని లక్ష్మణ్, డ్రైవర్ రంగస్వామిలపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల సహకారం కోసం పరిశీలనలు కొనసాగిస్తున్నారు.