MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం మున్సిపల్ 31వ వార్డులో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. సర్వేకు వచ్చే వార్డు ఆఫీసర్, కమిటీ సభ్యులకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.