HYD: తెలంగాణలో తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడంతో రాకపోకలు వేగవంతమయ్యాయి. ఖమ్మం-దేవరపల్లి కారిడార్లో వైరా నుంచి ఏపీ పొంగుటూరు వరకు 116 కి.మీ మార్గంలో వాహనాల ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు NHAI తెలిపింది. భారత్మాలా పథకం కింద నిర్మిస్తున్న ఈ హైవే పూర్తిగా పూర్తైతే హైదరాబాద్- రాజమండ్రి మధ్య దూరం 56 కి.మీ తగ్గనుంది.