BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు “నారీ శక్తి” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎరుకల రేణుక గణపతి హాజరయ్యారు. ఆమె విద్యార్థినీలకు మహిళా బిల్లు 33 శాతం రిజర్వేషన్ గురించి వివరించి, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కన్వీనర్ దాసరి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.