BDK: భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రవిచందర్ చౌహన్ సింగర్ మంగ్లీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జూలూరుపాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద గిరిజన బంజారా కుటుంబానికి చెందిన మంగ్లీ బాయ్ కష్టపడి ఎదిగిన వ్యక్తి అని, ఆమెపై జరుగుతున్న అసత్య ప్రచారాలను సమాజం తిప్పికొట్టాలని కోరారు.