వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న దీపక్ తివారి కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతీక్ జైన్ ఇక్కడి నుంచి నారాయణపేటకు బదిలీ అయ్యారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ప్రతీక్ జైన్, ముఖ్యంగా పాఠశాలల్లో వసతులపై ప్రత్యేక దృష్టి సారించి మంచి పేరు తెచ్చుకున్నాడు.